Loading...
Parawada Pharma City: పరవాడ ఫార్మాసిటీ అరబిందో ఫార్మా యూనిట్‌-15లో అగ్నిప్రమాదం..
పరవాడ ఫార్మాసిటీ అరబిందో ఫార్మా యూనిట్‌-15లో అగ్నిప్రమాదం..

Parawada Pharma City: పరవాడ ఫార్మాసిటీ అరబిందో ఫార్మా యూనిట్‌-15లో అగ్నిప్రమాదం..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2026
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

పరవాడ ఫార్మాసిటీలోని అరబిందో ఫార్మా కంపెనీలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో కంపెనీలోని యూనిట్‌-15 ప్రొడక్షన్‌ బ్లాక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపిస్తుండటాన్ని గమనించిన సిబ్బంది ప్రాణాలను కాపాడుకునేందుకు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, కంపెనీ యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ లేదా రసాయన చర్య కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

వివరాలు 

అగ్నిప్రమాదంపై హోంమంత్రి ఆరా

ప్రమాదానికి అసలు కారణమేంటో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

అరబిందో ఫార్మాలో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు.

అనకాపల్లి జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రమాదం జరిగిన తీరుతో పాటు అప్పటి పరిస్థితులపై ఆరా తీశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ADVERTISEMENT