Page Loader
Delhi: బోరు‌ బావిలో పడి 30ఏళ్ల యువకుడు మృతి
Delhi: బోరు‌ బావిలో పడి 30ఏళ్ల యవకుడు మృతి

Delhi: బోరు‌ బావిలో పడి 30ఏళ్ల యువకుడు మృతి

వ్రాసిన వారు Stalin
Mar 10, 2024
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేషోపూర్‌లోని దిల్లీ జల్ బోర్డు(డీజేబీ) వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో 40 అడుగుల బోరుబావిలో పడిన వ్యక్తి మృతి చెందాడు. రెస్క్యూ టీం అతడు చనిపోయినట్లు గుర్తించారు. దిల్లీ మంత్రి అతిషి ఈ విషయాన్ని వెల్లడించారు. రాత్రి ఒంటి గంట సమయంలో వ్యక్తి బోరుబావిలో పడిపోయాడు. అతని వయసు దాదాపు 30 ఏళ్లు ఉంటుందని మంత్రి అధికారులు చెప్పారు. తొలుత బోరుబావిలో పడింది.. బాలుడు అని అనుకున్నారు. కానీ రెస్క్యూ టీం గుర్తించిన తర్వాత అతను బాలుడు కాదని నిర్ధారించారు. ఇలాంటి కేసులు మళ్లీ రాకుండా చూసేందుకు దిల్లీలో మూతపడిన అన్ని ప్రైవేట్, ప్రభుత్వ బోర్‌వెల్‌లను 48గంటల్లోగా వెల్డింగ్ చేసి సీల్ చేసి నివేదిక సమర్పించాలని జల్ బోర్డుకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దిల్లీ మంత్రి  అతిషి ట్వీట్