Page Loader
Uttar Pradesh: భార్యను నరికి, ఆమె తల పట్టుకొని రోడ్డుపై తిరుగుతూ.. 
Uttar Pradesh: భార్యను నరికి, ఆమె తల పట్టుకొని రోడ్డుపై తిరుగుతూ..

Uttar Pradesh: భార్యను నరికి, ఆమె తల పట్టుకొని రోడ్డుపై తిరుగుతూ.. 

వ్రాసిన వారు Stalin
Feb 17, 2024
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

Man kills wife: ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని బారాబంకిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం ఆమెను కిరాతకంగా నరికి చంపాడు. ఆమె తల నరికి చేతిలో పట్టుకుని రోడ్డుపై అతడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి పోలీసులు ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, నిందితుడు తన భార్య నరికిన తల, మరో చేతిలో పదునైన ఆయుధంతో రోడ్డుపై వెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది. నిందితుడిని ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్రా గ్రామానికి చెందిన అమిత్ కుమార్ కన్నౌజియాగా పోలీసులు గుర్తించారు.

యూపీ

8ఏళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు పిల్లలు

నిందితుడు అమిత్ కుమార్ తన భార్య గొంతు కోసి.. ఆమె తలను వేరు చేసి.. దానితో రోడ్డుపై నడుచుకుంటున్న వెళ్తున్న క్రమంలో స్థానికులు తమకు సమాచారం అందించినట్లు పోలీసు సూపరింటెండెంట్ బారాబంకి దినేష్ కుమార్ సింగ్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అమిత్ కుమార్‌కు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అమిత్ తాపీ మేస్త్రీగా పనిచేసేవాడు. భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానిస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. కోపోద్రిక్తుడైన అతడు ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.