మణిపూర్: కుకీ-జో గిరిజనులను కాల్చి చంపిన తీవ్రవాద గ్రూపులు
మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం ఉదయం కనీసం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారని ఒక అధికారి తెలిపారు. గిరిజనులు అధికంగా ఉండే కంగ్‌గుయ్ ప్రాంతంలోని ఇరెంగ్, కరమ్ వైఫీ గ్రామాల మధ్య ఈ దాడి జరిగిందని ఆయన చెప్పారు. ముష్కరులు వాహనంలో వచ్చి ఇంఫాల్ వెస్ట్,కాంగ్‌పోకి జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో ఉన్న ఇరెంగ్, కరమ్ ప్రాంతాల మధ్య గ్రామస్తులపై దాడి చేశారని ఓ అధికారి తెలిపారు. కాంగ్‌పోక్పికి చెందిన పౌర సమాజ సంస్థ గిరిజన ఐక్యత కమిటీ (COTU) దాడిని ఖండించింది. మే 3న మణిపూర్‌లో జాతి హింస చెలరేగినప్పటి నుండి 180 మందికి పైగా మరణించగా అనేక వందల మంది గాయపడ్డారు.