Loading...
Mann Ki Baat 140th Episode: మోదీ మన్‌ కీ బాత్‌ 140వ ఎపిసోడ్‌.. సైబర్‌ భద్రతపై కీలక చర్చ
మోదీ మన్‌ కీ బాత్‌ 140వ ఎపిసోడ్‌.. సైబర్‌ భద్రతపై కీలక చర్చ

Mann Ki Baat 140th Episode: మోదీ మన్‌ కీ బాత్‌ 140వ ఎపిసోడ్‌.. సైబర్‌ భద్రతపై కీలక చర్చ

వ్రాసిన వారు Balachander Sharma
Nov 29, 2026
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయడంలో సంచార్‌ సాథీ కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పోర్టల్‌ను ఇప్పటివరకు 30 కోట్లకు పైగా సార్లు సందర్శించగా, దీని యాప్‌ను దాదాపు 3 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. బ్యాంకులు, పేమెంట్‌ యాప్‌లు, టెలికాం సంస్థలు, పోలీసు విభాగాలు సహా 1,600కు పైగా సంస్థలు ఈ వ్యవస్థతో అనుసంధానమయ్యాయి. వీటి సమన్వయంతో ఇప్పటివరకు రూ.5,000 కోట్లకు పైగా సంభవించగల సైబర్‌ మోసాల నష్టాన్ని అడ్డుకున్నట్లు మోదీ వివరించారు. డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతున్న సమయంలో ఇలాంటి వేదికల ప్రాధాన్యం మరింత పెరుగుతోందని ఆయన సందేశమిచ్చారు.

Details

17 భాషల్లో 7 వేలకుపైగా కోర్సులు

ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్పించడంలో ఐగాట్‌ కర్మయోగి వేదిక ఉపయోగపడుతోందని ప్రధాని పేర్కొన్నారు.

ఇందులో 17 భారతీయ భాషల్లో 7,000కు పైగా ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ పొందేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఉత్సాహం ప్రభుత్వ ఉద్యోగుల్లో కనిపిస్తోందని ప్రశంసించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ఉద్యోగులు కూడా ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Details

వ్యసనాన్ని జయిస్తున్న యువతకు ప్రశంసలు

మన్‌ కీ బాత్‌లో మోదీ నషా ముక్త్‌ యువ అభియాన్‌ గురించి కూడా ప్రస్తావించారు.

దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

వ్యసనానికి బానిసలైనప్పటికీ ఆత్మవిశ్వాసం, పట్టుదలతో దాని నుంచి బయటపడుతున్న యువతను అభినందించారు.

ఇలాంటి వారి అనుభవాలు మరెందరికో స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. 2014 అక్టోబర్‌లో ప్రారంభమైన 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమం ద్వారా మోదీ దేశ ప్రజలతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా 140వ ఎపిసోడ్‌ ప్రసారమైంది.

ADVERTISEMENT