LOADING...
Maoists: తెలంగాణ డీజీపీ సమక్షంలో లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు
తెలంగాణ డీజీపీ సమక్షంలో లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు

Maoists: తెలంగాణ డీజీపీ సమక్షంలో లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2026
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత ఏడాదిన్నర కాలంలో మొత్తం 763 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం రోజున 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా ఆయన ఎదుట లొంగిపోయారు. వీరిలో బెటాలియన్‌ ఉప కమాండర్‌ కేశాలు కూడా ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో కూంబింగ్ చర్యలు తీవ్రంగా పెరగడంతో అక్కడి మావోయిస్టులు తెలంగాణ పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఒక్కరు మాత్రమే తెలంగాణకు చెందినవారు కాగా, మిగతా వారంతా ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందినవారేనని తెలిపారు.

వివరాలు 

పునరావాస పథకం కింద రూ.1.93 కోట్లు

లొంగిపోయిన వారికి పునరావాస పథకం కింద రూ.1.93 కోట్లు అందజేస్తున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారికి ఆరోగ్య కార్డులు కూడా అందించనున్నట్లు చెప్పారు. ఒకప్పుడు కేంద్ర కమిటీలో తెలంగాణకు చెందిన 11 మంది సభ్యులు ఉండేవారని, ప్రస్తుతం ఇద్దరే మిగిలినట్లు తెలిపారు. రాష్ట్ర కమిటీలోనూ తెలంగాణకు చెందిన 24 మంది ఉండగా, ఇప్పుడు ఇద్దరే ఉన్నారని చెప్పారు. మిగిలిన వారు కూడా లొంగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement