
Volunteers Resign: రాజకీయపార్టీలు చేస్తున్నవిమర్శలతో మనస్తాపం.. మచిలీపట్నంలో వాలంటీర్ల రాజీనామాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నికల విధుల్లో వాలంటీర్ల జోక్యాన్ని నివారించాలంటూ కొన్ని రాజకీయపార్టీలు చేస్తున్నవిమర్శలతో మనస్తాపం చెందిన మచిలీపట్నంలోని కొందరు వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.
తమ రాజీనామా పత్రాలను మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ కి అందజేశారు. వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలతో మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయం కిక్కిరిసిపోయింది.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా పింఛన్లు పంపిణీ చేయకూడదని కొన్ని రాజకీయపార్టీలు ఆక్షేపించడంతో వాలంటీర్లు మనస్తాపం చెందారు.
రాజకీయాలకతీతంగా సేవలందిస్తున్న తమపై రాజకీయంగా బురద చల్లడం సరికాదని వాలంటీర్లు పేర్కొంటున్నారు.
నిస్వార్థంగా సేవలందిస్తున్న తమను వృద్ధులకు పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకోవడం కలచివేసిందని అంటున్నారు.
Details
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న 1200 మంది వాలంటీర్లు
ఎన్నికల కోడ్ అమలులో భాగంగా తమనుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను సైతం తీసేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మచిలీపట్నం నియోజకవర్గంలో 1200 మంది వాలంటీర్లు గత 50 నెలలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే కొన్ని రాజకీయపార్టీలు తమను రాజకీయాలకు ఆపాదిస్తున్నారని వాలంటీర్లు వాపోతున్నారు.