Mayawati: మేనల్లుడికి మాయావతి షాక్.. ఆకాశ్‌ను పార్టీ బాధ్యతల నుంచి తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
బహుజన్ సమాజ్ పార్టీ (BSP)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించారు. అంతేకాకుండా సోదరుడు ఆనంద్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు.
ఆనంద్‌ను BSP జాతీయ కోఆర్డినేటర్‌గా నియమిస్తూ మాయావతి అధికారిక ప్రకటన చేశారు. ఆకాష్ తండ్రియైన ఆనంద్ ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
ఆనంద్‌తో పాటు రాజ్యసభ ఎంపీ రామ్‌జీ గౌతమ్‌ను కూడా కొత్త జాతీయ స్థాయి సమన్వయకర్తలుగా నియమించారు.
Details
పార్టీ విధానాలకు హానీ కలిగిస్తే చర్యలు తప్పవు
ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో మాయావతి ఈ కీలక నిర్ణయం ప్రకటించారు.
పార్టీ విధానాలకు హాని కలిగించేలా వ్యవహరించినట్లు తేలడంతో ఆకాష్ ఆనంద్‌ను తొలగించినట్లు ఆమె వివరించారు.
గతంలో ఆకాశ్ మామ అశోక్ సిద్ధార్థ్‌ను కూడా పార్టీ నుంచి బహిష్కరించామన్న విషయాన్ని గుర్తుచేశారు.
ఒకప్పుడు ఆకాష్ తన రాజకీయ వారసుడని ప్రకటించినా తాజా పరిణామాల నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు మాయావతి స్పష్టం చేశారు.