Page Loader
Medak Student : సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య తన్నులాట.. అర్ధనగ్నంగా నిరసన
అర్ధనగ్నంగా నిరసన

Medak Student : సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య తన్నులాట.. అర్ధనగ్నంగా నిరసన

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 28, 2023
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో కొందరు విద్యార్థులు హల్ చల్ చేశారు. సెక్యూరిటీ ఎంట్రీతో దెబ్బకు పరారయ్యారు. చక్కగా కాలేజీకి వెళ్లి మంచిగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాల్సిన విద్యార్థులు దారి తప్పి తల్లిదండ్రుల పరువు తీస్తున్నారు. కన్నవారి ఆశలు అడియాశలయ్యేలా ప్రవర్తిస్తున్నారు. చేజేతులారా జీవితాలను నాశనం చేస్తుకుటుంన్నారు. ఇటీవలే కాలంలో పాఠశాలలు, కళాశాలల్లో చిన్న విషయాలకే విద్యార్థులు గొడవపడటం సర్వ సాధారణమైపోయింది. చిన్న వివాదాలు పెద్దవై ప్రాణాలు తీసుకునే సందర్భాలు ఎక్కువే ఉన్నాయి. ఓ కళాశాలలో ఫస్ట్ ఇయర్,సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు చిన్న గొడవ జరిగింది. అది కాస్త పెరిగి చివరకు దుమారానికి కారణమైంది. ఫలితంగా ఓ విద్యార్థి అర్ధనగ్నంగా తిరుగుతూ హంగామా చేశాడు.

DETAILS

పరస్పరం బాదుకున్న విద్యార్థులు

దీనిపై సమాచారం అందుకున్న సెక్యూరీటి సిబ్బంది కళాశాలలోకి ఎంట్రీ ఇచ్చారు. గమనించిన విద్యార్థులు అక్కడ్నుంచి పరారయ్యారు. మెదక్ జిల్లా నర్సాపూర్'లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలోని సీనియర్లు, జూనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. కాలేజీ బయట సీనియర్లు, జూనియర్లుగా విద్యార్థులు విడిపోయి పరస్పరం బాదుకున్నారు. ఈ గ్యాంగ్ వార్'లో జూనియర్ విద్యార్థికి గాయాలయ్యాయి. అతన్ని పట్టుకుని విచక్షణా రహితంగా కొట్టడంతో చొక్కా చిరిగిపోయింది. దీంతో ఆ విద్యార్థి చిరిగిన చొక్కాతోనే కాలేజీ గ్రౌండ్'లో అర్ధనగ్నంగా తిరుగుతూ హంగామా చేశాడు. సీనియర్ల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయని నిరసిస్తూ గ్రౌండ్ చుట్టూ అర్ధనగ్నంగా పరిగెత్తారు. సీనియర్లు, జూనియర్ల మధ్య వార్ ఎందుకు జరుగుతోందన్న విషయం మీద స్పష్టత రాలేదు. వీరి గొడవకు ఏదైనా కారణముందా అనేది తెలియరాలేదు.