Loading...
Hyderabad's CURE Area: క్యూర్‌ ప్రాంతంలో ప్రయాణికులకు ఊరట.. మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు తగ్గింపు
మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు తగ్గింపు

Hyderabad's CURE Area: క్యూర్‌ ప్రాంతంలో ప్రయాణికులకు ఊరట.. మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు తగ్గింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2026
08:20 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో 'క్యూర్‌' ప్రాంతంలో మెట్రో రైలు,ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి త్వరలో ఊరట లభించనుంది. రెండు రవాణా వ్యవస్థల్లోనూ ప్రయాణించేందుకు ప్రవేశపెట్టిన ఉమ్మడి పాస్‌ ధరలను భారీగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రోజువారీ పాస్‌ను రూ.325కు,నెలవారీ పాస్‌ను రూ.4,000 లేదా రూ.4,500కు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మెట్రో రైలు,ఆర్టీసీ యాజమాన్యాల మధ్య కీలక చర్చలు జరిగి,ఒక అవగాహనకు వచ్చారు. నేడో, రేపో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుతో ఆర్టీసీ ఎండీ,మెట్రో రైలు సలహాదారు సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం పాస్‌ ధరలపై పూర్తి స్పష్టత రావడంతోపాటు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.

వివరాలు 

నెలవారీ పాస్‌ ధర సగానికి తగ్గింపు

తగ్గించిన ఉమ్మడి పాస్‌ ధరలను దీపావళి నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిసింది.

ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలో మెట్రో రైళ్లతోపాటు ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణించేందుకు ఉమ్మడి పాస్‌ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు.

అయితే, ప్రారంభంలో నిర్ణయించిన ధరలు అధికంగా ఉండటంతో ప్రయాణికుల నుంచి ఆశించిన స్పందన రాలేదు.

ముఖ్యంగా నెలవారీ పాస్‌ ధరను రూ.8,500గా నిర్ణయించడం ప్రయాణికుల ఆదరణపై ప్రతికూల ప్రభావం చూపింది.

దీంతో పాస్‌ ధరలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మెట్రో రైలు సలహాదారు ఎన్వీఎస్‌ రెడ్డితో చర్చలు జరిపారు.

వివరాలు 

నెలవారీ పాస్‌ ధర సగానికి తగ్గింపు

నెలవారీ పాస్‌ ధరను రూ.4,000 లేదా రూ.4,500కు పరిమితం చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం.

ఇందులో ఆర్టీసీకి రూ.1,000, మెట్రోకు రూ.3,000 లేదా రూ.3,500 కేటాయించేలా చర్చలు జరిగినట్లు తెలిసింది.

ప్రస్తుతం రోజువారీ ఉమ్మడి పాస్‌ ధర రూ.400గా ఉంది. దీనిని రూ.325కు తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఈ పాస్‌ ద్వారా వచ్చే మొత్తంలో ఆర్టీసీకి రూ.75, మెట్రోకు రూ.250 చొప్పున కేటాయించనున్నట్లు తెలిసింది.

ADVERTISEMENT