ANM Posts: ఏఎన్‌ఎం పోస్టుల తొలి ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఏఎన్‌ఎం (ఎంపీహెచ్‌ఏ-ఫిమేల్) పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) తొలి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా భర్తీ చేయనున్న మొత్తం 1,931 ఏఎన్‌ఎం పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల వివరాలను ఈ జాబితాలో పొందుపరిచింది. ఇప్పటికే మే 14న నిర్వహించిన పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులతో పాటు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సేవలకు వర్తించే వెయిటేజీ మార్కులను పరిగణనలోకి తీసుకుని ప్రొవిజనల్ జాబితాను విడుదల చేసిన బోర్డు, దానిపై అభ్యంతరాలను స్వీకరించింది.
వివరాలు
అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు..
అందిన అభ్యంతరాలను పరిశీలించి, వాటిని పరిష్కరించిన అనంతరం తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను తాజాగా ప్రకటించింది. ఈ మెరిట్ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని బోర్డు స్పష్టం చేసింది.