తదుపరి వార్తా కథనం
Nara Lokesh: విజయవాడలో నారా లోకేశ్ చేతుల మీదుగా మధ్యాహ్న భోజన పథక ప్రారంభం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 04, 2025
12:35 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ లాంఛనంగా ప్రారంభించారు.
విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రారంభోత్సవ అనంతరం మంత్రి నారా లోకేష్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్‌లను పరిశీలించారు.
Details
గతంలో ఈ పథకాన్ని నిలిపివేసిన వైసీపీ
ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎంపీ శివనాథ్, బొండా ఉమ హాజరయ్యారు.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకాన్ని నిలిపివేశారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు మళ్లీ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించారు.