Loading...
Nara Lokesh : ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. కిటెక్స్‌ సీఎండీకి మంత్రి నారా లోకేశ్‌ ఆహ్వానం
ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. కిటెక్స్‌ సీఎండీకి మంత్రి నారా లోకేశ్‌ ఆహ్వానం

Nara Lokesh : ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. కిటెక్స్‌ సీఎండీకి మంత్రి నారా లోకేశ్‌ ఆహ్వానం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 01, 2026
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కిటెక్స్‌ గార్మెంట్స్‌ను మంత్రి నారా లోకేశ్‌ ఆహ్వానించారు. దేశంలోని ప్రముఖ దుస్తుల తయారీ సంస్థల్లో ఒకటైన కిటెక్స్‌ గార్మెంట్స్‌ సీఎండీ సబు ఎం.జాకబ్‌తో ఆయన బుధవారం కొచ్చిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టెక్స్‌టైల్స్‌ రంగం,తయారీ పరిశ్రమకు ఉన్న అవకాశాలు,ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధిపై ఇరువురు చర్చించారు. వస్త్ర తయారీ రంగానికి ఏపీలో విస్తృత అవకాశాలు ఉన్నాయని లోకేశ్‌ తెలిపారు.

వివరాలు 

కొచ్చిలోని సంస్థ కర్మాగారాన్ని సందర్శించిన లోకేశ్

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కిటెక్స్‌ సంస్థను కోరారు.

పెట్టుబడులకు అనుకూలమైన అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

కిటెక్స్‌ సీఎండీ సబు ఎం. జాకబ్‌ ఆహ్వానం మేరకు లోకేశ్‌ కొచ్చిలోని సంస్థ కర్మాగారాన్ని కూడా సందర్శించారు.

అక్కడ జరుగుతున్న వస్త్ర తయారీ ప్రక్రియను ఆయన పరిశీలించారు. తయారీ విధానం, పరిశ్రమలోని కార్యకలాపాలను స్వయంగా తెలుసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేరళలో కిటెక్స్ ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రి లోకేష్

ADVERTISEMENT