Kridaapp: అమరావతి కేంద్రంగా 2027లో జాతీయ స్థాయి క్రీడలు: రాంప్రసాద్‌రెడ్డి
అమరావతిని కేంద్రంగా చేసుకుని 2027లో జాతీయ స్థాయి పోటీలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. విజయవాడలో గురువారం ఆయన ప్రారంభించిన 'క్రీడాయాప్' కార్యక్రమంలో మాట్లాడారు. జాతీయ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సాంకేతికతను వినియోగించి కొత్త ఒరవడిని సృష్టించామని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే క్రీడాపాలసీని అమలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, క్రీడాశాఖ కార్యదర్శి వినయ్ చంద్, శాప్ వీసీ మరియు ఎండీ గిరీశ పాల్గొన్నారు.