Kolikapudi: టీడీపీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఎదుట హాజరైన అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ క్రమశిక్షణ సంఘం కమిటీ ముందు హాజరయ్యారు.
కమిటీతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
క్రమశిక్షణ సంఘం సభ్యులకు నేను రాతపూర్వకంగా, ప్రత్యక్షంగా అన్ని వివరాలను వివరించానని అన్నారు.
ఈనెల 11న టీడీపీ కార్యకర్త మరణించడాన్ని అనుసరించి గోపాలపురం గ్రామం వెళ్లి పరామర్శ చేశాను.
అక్కడ వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వం నిర్మించిన సిమెంట్ రోడ్డుపై ముళ్లకంచె అడ్డంగా వేసారు.
స్థానికులు కూడా కంచెను దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే నేను కంచెను తొలగించాను.
నేను కంచెను తొలగించడాన్ని వైసీపీ కుటుంబం తప్పుగా తీసుకొని నన్ను టార్గెట్ చేశారు.
ఆ కుటుంబం వారు ఆత్మహత్యాయత్నం చేసి రాద్దాంతం చేస్తున్నారని క్రమశిక్షణ కమిటీ సభ్యులకు వివరించాను.
వివరాలు
వాస్తవం తిరువూరు ప్రజలే తెలుసుకుంటారు
పంచాయతీ తీర్మానంతోనే ఆ సీసీ రోడ్ నిర్మించారు. వైసీపీ కుటుంబం 2013లో చంద్రబాబుపై నీళ్ల బాటిల్ విసిరిందని, అంతేకాకుండా, గతంలో జవహర్, స్వామి దాస్ వంటి నేతలపై దాడులు చేసి వాహనాలను పగలగొట్టారని కొలికపూడి తెలిపారు.
ఆ రోజు జరిగిన పరిణామాలను ఈరోజు క్రమశిక్షణ కమిటీ ముందు వివరించానని ఆయన తెలిపారు.
సోషల్ మీడియాలో వేరే విధంగా వార్తలు వస్తున్నాయని, కానీ వాటి వాస్తవం తిరువూరు ప్రజలే తెలుసుకుంటారని అన్నారు.
రోడ్డుపై అడ్డంగా ఉన్న ముళ్ల కంచెను తీసేయడం చట్ట ఉల్లంఘనమా అని ఆయన ప్రశ్నించారు.
క్రమశిక్షణ కమిటీ సభ్యులకు రాతపూర్వకంగా, ప్రత్యక్షంగా వివరాలు ఇచ్చాను అని కొలికపూడి తెలిపారు.
వివరాలు
వివరాలను హైకమాండ్‌కు పంపిస్తాం: కొనకళ్ల నారాయణ
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి క్రమశిక్షణ కమిటీ ముందు ఎక్కడ జరిగిన పరిణామాలను వివరించారని, గోపాలపురం మహిళ ఆత్మహత్యాయత్నం ఘటనలో ఆయన నుండి వివరాలు తీసుకున్నామని క్రమశిక్షణ కమిటీ సభ్యుడు కొనకళ్ల నారాయణ అన్నారు.
ఆయన చెప్పిన అన్ని వివరాలను హైకమాండ్‌కు పంపిస్తామని చెప్పారు.
ఈ వివాదంలో తనకు ఎటువంటి సంబంధం లేదని కొలికపూడి చెప్పారు. వైసీపీ వాళ్లే కంచె వేసారని, అందుకే ఆయన ఆ కంచెను తొలగించారని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
టీడీపీలో ఎవరైనా క్రమశిక్షణ పాటించాలి: వర్ల రామయ్య
టీడీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు వర్ల రామయ్య, టీడీపీలో ప్రతి కార్యకర్త, ఎమ్మెల్యే కూడా క్రమశిక్షణ పాటించాల్సిందిగా చెప్పారు.
టీడీపీ పాలనలో, తిరువూరు ఎమ్మెల్యే పార్టీ లైన్ దాటుతున్నారని, ఆయన వ్యవహారశైలి సరిగ్గా లేదని ఈరోజు క్రమశిక్షణ కమిటీ సభ్యులు కొలికపూడికు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నారని, ఈ ఏడాది మొత్తం రెండు ఘటనలలో కొలికపూడి రెండు సార్లు క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చారని అన్నారు.
త్వరలో చంద్రబాబు నాయుడుకు ఈ అంశంపై రిపోర్టు పంపిస్తామని వర్ల రామయ్య తెలిపారు.