తదుపరి వార్తా కథనం
Sheikh Sabji: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్సీ కన్నుమూత
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 15, 2023
02:12 pm
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీచర్స్ ఎమ్మెల్సీ (PDF) షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు.
ఉండి మండలం చెరుకువాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలో పాల్గొని ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఆయన కారును మరో వాహనం ఢీకొట్టింది.
Details
మరో నలుగురికి తీవ్ర గాయాలు
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్సీని ఆస్పత్రికి తీసుకెళ్తుతుండగా మార్గమధ్యలో చనిపోయారు.
ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు.
ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.