Loading...
Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్‌కు స్వార్థం లేని స్వయంసేవకులే అసలైన గుర్తింపు: భాగవత్
ఆర్‌ఎస్‌ఎస్‌కు స్వార్థం లేని స్వయంసేవకులే అసలైన గుర్తింపు: భాగవత్

Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్‌కు స్వార్థం లేని స్వయంసేవకులే అసలైన గుర్తింపు: భాగవత్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2026
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

వందేళ్ల ప్రస్థానంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు స్వార్థం లేని స్వయంసేవకులే అసలైన గుర్తింపు అని ఆ సంస్థ అధినేత మోహన్ భగవత్ అన్నారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ శ్రేయస్సు కోసం పనిచేసేవారే నిజమైన ప్రచారకులని పేర్కొన్నారు. సోమవారం నాగ్‌పూర్‌లో నాగరిక్ సహకారి బ్యాంక్ నూతన ఆడిటోరియాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ ప్రస్థానం, గతంలో ఎదురైన పరిస్థితులను ప్రస్తావించారు.

వివరాలు 

ప్రావిన్స్ అసెంబ్లీలో ఇబ్రహీం మద్దతు..

1930వ దశకంలో ఆర్‌ఎస్‌ఎస్‌పై తొలిసారి నిషేధం విధించేందుకు జరిగిన ప్రయత్నానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని మోహన్ భాగవత్ గుర్తుచేసుకున్నారు.

అప్పట్లో ఆర్‌ఎస్‌ఎస్‌ను సమర్థించే స్వయంసేవకులు, ఆ సంస్థ భావజాలానికి మద్దతు తెలిపే వ్యక్తులు సెంట్రల్ ప్రావిన్స్ అసెంబ్లీలో ఎవరూ లేరని చెప్పారు.

అయితే, నిషేధానికి వ్యతిరేకంగా సభలో గళమెత్తిన ఏకైక వ్యక్తి ఇబ్రహీం అని వెల్లడించారు.

ఆర్‌ఎస్‌ఎస్ మతతత్వ సంస్థ కాదని, దానిపై నిషేధం విధించకూడదని నాటి సెంట్రల్ ప్రావిన్స్ అసెంబ్లీలో ఇబ్రహీం వాదించినట్లు మోహన్ భాగవత్ వివరించారు.

ADVERTISEMENT