LOADING...
monsoon: అండమాన్‌కు రుతుపవనాల ఎంట్రీ.. 14-16 మధ్య నైరుతి గాలుల రాక!
అండమాన్‌కు రుతుపవనాల ఎంట్రీ.. 14-16 మధ్య నైరుతి గాలుల రాక!

monsoon: అండమాన్‌కు రుతుపవనాల ఎంట్రీ.. 14-16 మధ్య నైరుతి గాలుల రాక!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 02, 2026
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణానికి ముందుగానే దేశాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈ నెల 14 నుంచి 16 తేదీల మధ్య ఇవి అండమాన్-నికోబార్ దీవులకు చేరుకునే అవకాశముందని పేర్కొంది. ఇది సాధారణంగా వచ్చే సమయంతో పోలిస్తే కొంత ముందుగానే కావడం గమనార్హమని తెలిపింది. దీని ప్రభావంతో మే నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, అలాగే పశ్చిమ భారతంలో అధిక వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.

వివరాలు

సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం

మరోవైపు ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు-మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే, ఈసారి మే నెలలో పగటి వేడి మాత్రమే కాకుండా రాత్రి సమయంలో కూడా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. అయితే దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో లేదా అంతకంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సముద్రం నుంచి వచ్చే తేమతో కూడిన వేడి గాలుల కారణంగా ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Advertisement