NAFFCO: తెలంగాణలో దుబాయ్ సంస్థ 'నాఫ్కో' రూ.700 కోట్ల పెట్టుబడులు
లైఫ్ సేఫ్టీ సొల్యూషన్స్‌లో ప్రపంచంలోనే ప్రముఖ తయారీదారు, సరఫరాదారుగా ఉన్న దుబాయ్‌కి చెందిన నాఫ్కో(NAFFCO) గ్రూప్ తెలంగాణలో తమ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుచొచ్చారు. ఈ మేరకు ఆ సంస్థ రూ.700 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఇది కాకుండా, ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీని స్థాపించడానికి హైదరాబాద్‌లోని కంపెనీ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌తో చేతులు కలపనుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మంగళవారం ట్విట్టర్ వేదికగా ఈ విషయాలను పంచుకున్నారు. \ 100కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాఫ్కో కంపెనీలో కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో పర్యటిస్తున్నారు.
డీపీ వరల్డ్ రూ.215 కోట్ల పెట్టుబడులు
ప్రపంచంలోని అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్లలో ఒకటైన డీపీ వరల్డ్ తెలంగాణలో రూ.215 కోట్ల పెట్టుబడులు పెట్టి తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో మంగళవారం దుబాయ్‌లో గ్రూప్ ఈవీపీ (కార్పొరేట్ ఫైనాన్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్) అనిల్ మోహతా సమావేశమైన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. సంస్థ తన కార్యకలాపాలను విస్తరించడంతో పాటు రూ.165 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోను ఏర్పాటు చేయనుంది. తెలంగాణలో లాజిస్టిక్స్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డీపీ వరల్డ్ పెట్టుబడులు దోహదపడతాయని పరిశ్రమల శాఖ మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కంపెనీ కార్యకలాపాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు.