తదుపరి వార్తా కథనం
Nara Lokesh: భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్‌తో నారా లోకేశ్ భేటీ.. రక్షణ పరికరాల తయారీపై చర్చలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 22, 2025
10:15 am
ఈ వార్తాకథనం ఏంటి
దావోస్‌లో ఏపీ బృందం పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ అమిత్ బి కల్యాణితో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు.
మంత్రి నారా లోకేశ్ ఏపీలో రక్షణ పరికరాల తయారీ పనులు త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ఆర్ అండ్ డీ శిక్షణ కేంద్రం, రక్షణ రంగ పరికరాల తయారీ కోర్సులు, కొత్త ఐటీఐల ఏర్పాటుకు సహకరించాలని కోరారు.
ఐటీఐలలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని నారా లోకేశ్ కోరారు. భారత్ ఫోర్జ్ ప్రతినిధులు మడకశిర పరిధిలో రక్షణ పరికరాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
ముద్దనహళ్లిలో 1,000ఎకరాల విస్తీర్ణంలో రూ. 2,400 కోట్లతో ఈ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.