LOADING...
Delhi : దిల్లీలో 3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత.. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఐఎండీ 'రెడ్ అలర్ట్' జారీ
పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఐఎండీ 'రెడ్ అలర్ట్' జారీ

Delhi : దిల్లీలో 3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత.. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఐఎండీ 'రెడ్ అలర్ట్' జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 13, 2026
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర భారతాన్ని చలిపులి వణికిస్తోంది.దేశ రాజధాని దిల్లీ మంగళవారం 3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతను నమోదు చేసింది,ఇది ఈ సీజన్‌లో అత్యంత తక్కువ. అదే సమయంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తీవ్ర చలిగాలులు, దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు చాలా చోట్ల గడ్డకట్టే స్థాయికి చేరాయి. ఢిల్లీలో సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.4 డిగ్రీలు తక్కువగా రికార్డయింది. ఉదయం గాలిలో తేమ 100 శాతానికి చేరగా,పంజాబ్‌లోని భటిండా 0.6 డిగ్రీలు, అమృత్‌సర్, ఫరీద్‌కోట్‌లో ఒక డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదు చేశాయి. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు దిగగా, శివారువిభాగాల్లో -0.9 డిగ్రీలు నమోదు అయ్యాయి.

వివరాలు 

జనవరి 17 వరకు చలి ప్రభావం ఉంటుందని హెచ్చరిక 

రాజస్థాన్‌లోని సికార్ జిల్లా ఫతేపూర్ శేఖావతిలో పరిస్థితి మరింత తీవ్రమైంది.అక్కడ -1.9డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన చలి,దట్టమైన పొగమంచు కారణంగా సాధారణ జనజీవనం స్తంభించగా,పలు ప్రాంతాల్లో నేలపై మంచు పొర ఏర్పడింది. పొగమంచు వలన వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైతులు, ముఖ్యంగా ఆవాలు, టమాటా,మిరప పంటల మీద మంచు ప్రభావం ఉంటుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర హర్యానాపై ఏర్పడిన పశ్చిమ విక్షోభం,ఉపరితల గాలుల ప్రభావం వలన ఈ చలికాలం కొనసాగుతోంది.రాబోయే రెండు రోజుల పాటు ఢిల్లీలో చలిగాలుల ప్రభావం కొనసాగుతుందని,ఆ తరువాత ఉష్ణోగ్రతలు క్రమంగా 2-4 డిగ్రీల వరకు పెరుగుతాయని చెప్పారు.అయితే, జనవరి 17 వరకు ఈ ప్రాంతంలో యెల్లో అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వెథర్ మెన్ చేసిన ట్వీట్ 

Advertisement