Loading...
Nellore: రూపాయికే ఫంక్షన్‌హాల్‌.. పేదలు,మధ్య తరగతి వారికి నెల్లూరు కార్పొరేషన్‌ గుడ్‌న్యూస్
పేదలు,మధ్య తరగతి వారికి నెల్లూరు కార్పొరేషన్‌ గుడ్‌న్యూస్

Nellore: రూపాయికే ఫంక్షన్‌హాల్‌.. పేదలు,మధ్య తరగతి వారికి నెల్లూరు కార్పొరేషన్‌ గుడ్‌న్యూస్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2026
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

నెల్లూరు నగరపాలక సంస్థ పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు శుభవార్త చెప్పింది. శుభకార్యాలు నిర్వహించుకునేందుకు వీలుగా నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను కేవలం రూపాయి అద్దెకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల నిర్మాణం పూర్తయిన ఈ హాల్‌ను ఆగస్టు 16న మంత్రి నారాయణ ప్రారంభించారు. ప్రారంభ సమయంలోనే దీనిని రూపాయికే అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. కార్పొరేట్‌ స్థాయి సౌకర్యాలతో ఈ ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. మొత్తం హాల్‌కు సెంట్రల్‌ ఏసీ ఏర్పాటు చేయడంతోపాటు నేలపై టైల్స్‌ వేశారు.

వివరాలు 

ఫంక్షన్‌హాల్‌ నిర్మాణానికి ఎన్‌క్యాప్‌ నిధుల నుంచి రూ.25 లక్షలు ఖర్చు

ఒకేసారి సుమారు 5 వేల మంది హాజరయ్యేలా హాల్‌ సామర్థ్యాన్ని కల్పించారు. వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఈ ఫంక్షన్‌హాల్‌ నిర్మాణానికి ఎన్‌క్యాప్‌ నిధుల నుంచి రూ.25 లక్షలు ఖర్చు చేశారు.

అలాగే నెల్లూరు నగరపాలక సంస్థకు చెందిన రూ.1.15 కోట్లను వినియోగించారు.

మొత్తంగా సుమారు రూ.1.40 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ హాల్‌ను పేదలు, మధ్య తరగతి ప్రజలు శుభకార్యాలకు తక్కువ ఖర్చుతో వినియోగించుకునేలా రూపాయికే అద్దెకు ఇవ్వాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది.

ADVERTISEMENT