తదుపరి వార్తా కథనం
H1B Visa: స్వదేశానికి రావాల్సిన అవసరం లేదు.. అమెరికాలోనే హెచ్-1బీ రెన్యువల్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 07, 2025
03:40 pm
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు వీసా కష్టాలు త్వరలో తగ్గనున్నాయి.
హెచ్-1బీ వీసా పునరుద్ధరణ కోసం వారు స్వదేశానికి తిరిగి రావాల్సిన అవసరం లేకుండా, అక్కడే వీసా రెన్యువల్ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది.
ఈ విషయాన్ని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.
ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న భారత వృత్తి నిపుణుల కోసం ఈ కొత్త వీసా రెన్యువల్ సదుపాయం వరంగా మారనుంది.
Details
ఈ ఏడాదిలోనే అమలు
ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రోగ్రామ్) అమలు చేస్తే విజయవంతంగా ముగిసినందున, ఈ ఏడాదిలోనే ఈ కార్యక్రమాన్ని అధికారికంగా అమలు చేయాలని అమెరికా అధికారులు ప్రకటించారు.
దీంతో భారతీయ వృత్తి నిపుణులకు స్వదేశం తిరిగి రావాల్సిన అవసరం లేకుండా వీసా పునరుద్ధరణ ప్రక్రియ సులభంగా ఉండనుంది.