LOADING...
Petrol - diesel: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

Petrol - diesel: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

వ్రాసిన వారు Moogati Shabari
Apr 23, 2026
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచే ఆలోచనలో లేదని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ఇంధన ధరలు పెరుగుతాయనే వార్తలను అది పూర్తిగా నిరాకరించింది. లీటరుకు రూ.25 నుంచి రూ.28 వరకు పెరిగే అవకాశం ఉందని కొన్ని మీడియా కథనాలు వచ్చినప్పటికీ, వాటిలో నిజం లేదని తెలిపింది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ 'ఎక్స్‌' వేదిక ద్వారా వెల్లడించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయని ప్రచారం అవాస్తవమని మరోసారి స్పష్టం చేసింది.

వివరాలు

గత నాలుగేళ్లుగా ఆ మార్పు లేదన్న కేంద్రం..

ఇక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పూర్తయ్యాక ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ పేర్కొంది. ఏప్రిల్‌ 29న పోలింగ్‌ అనంతరం ధరల పెంపు ఉండొచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని కూడా తెలిపింది. కేంద్రం స్పందిస్తూ.. గత నాలుగు సంవత్సరాలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పులు చేయలేదని గుర్తుచేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగినా, ఆ ప్రభావం ప్రజలపై పడకుండా ప్రభుత్వం, చమురు సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొంది. యుద్ధం ప్రారంభానికి ముందు బ్యారెల్‌కు సుమారు 70 డాలర్లుగా ఉన్న ముడి చమురు ధర, ప్రస్తుతం 100 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతోందని తెలిపింది.

Advertisement