
AP Mega DSC 2025: నేడు ఏపీలో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులకు ఉత్సాహం కలిగించే శుభవార్త వెలువడింది.
పలువురు ఆతృతగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఈరోజు (ఏప్రిల్ 20) విడుదల చేయనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీగా మొత్తం 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనుంది.
ఈ నేపథ్యంలో డీఎస్సీకి సంబంధించిన జీవోలు, ఖాళీల వివరాలు, పరీక్షల షెడ్యూల్, సిలబస్ తదితర సమాచారాన్ని విద్యాశాఖ ఈరోజు ఉదయం 10 గంటలకు తమ ఆధికారిక వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయనుంది.
డీఎస్సీ అభ్యర్థులకు మరొక ముఖ్యమైన ఊరటగా వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది ఎన్నో సంవత్సరాలుగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలవనుంది.
Details
మెగా డీఎస్సీ 2025 - కీలక తేదీల వివరాలు
ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు & ఫీజు చెల్లింపు
మే 20 నుంచి - మాక్ టెస్ట్‌లు ప్రారంభం
మే 30 నుంచి - హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం
జూన్ 6 నుంచి జులై 6 వరకు - డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ
పరీక్షల తర్వాత రెండో రోజే - ప్రాథమిక 'కీ' విడుదల
తదుపరి ఏడు రోజులు - అభ్యంతరాల స్వీకరణ గడువు
అభ్యంతరాల గడువు ముగిసిన 7వ రోజున - తుది 'కీ' విడుదల
తుది కీ విడుదలైన 7 రోజుల్లోపు - ఫలితాల విడుదల