Loading...
Hyderabad: కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఫ్లైఓవర్లు రద్దు.. వన్‌వేతో మారిన ట్రాఫిక్‌ ప్రణాళిక
కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఫ్లైఓవర్లు రద్దు.. వన్‌వేతో మారిన ట్రాఫిక్‌ ప్రణాళిక

Hyderabad: కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఫ్లైఓవర్లు రద్దు.. వన్‌వేతో మారిన ట్రాఫిక్‌ ప్రణాళిక

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2026
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్'లోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ ప్రణాళికలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇటీవల ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చిన వన్‌వే విధానం ట్రాఫిక్‌ సమస్యలను చాలావరకు పరిష్కరించడంతో.. రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాలనుకున్న పలు ప్రాజెక్టులను రద్దు చేసే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారు. వాటికి బదులుగా పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వరకు ఒకే భారీ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలని ప్రతిపాదించారు.

వివరాలు 

వన్‌వేతో మెరుగైన ట్రాఫిక్‌ ప్రవాహం

గతంలో కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఉన్న ఏడు ప్రధాన జంక్షన్ల వద్ద సిగ్నళ్ల కారణంగా వాహనదారులు నిమిషాల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది.

అయితే, నిర్మాణ పనుల నేపథ్యంలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన వన్‌వే విధానం అనూహ్యంగా మంచి ఫలితాలను ఇచ్చింది.

ప్రస్తుతం వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోకుండా సాఫీగా సాగుతున్నాయి.

దీంతో భారీగా నిధులు వెచ్చించి పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించడం అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు.

వివరాలు 

4 కిలోమీటర్ల మేర ఆరు వరుసల కారిడార్

కొత్త ప్రతిపాదన ప్రకారం.. పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వరకు సుమారు 4 కిలోమీటర్ల పొడవునా ఆరు వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించనున్నారు.

దీనివల్ల ఐటీ కారిడార్‌ నుంచి పంజాగుట్ట, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు సిగ్నళ్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా నేరుగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వానికి రూ.1,000 కోట్లకు పైగా ఆదా

ఈ మార్పు ద్వారా భూసేకరణ, నిర్మాణ వ్యయాల రూపంలో ప్రభుత్వానికి రూ.1,000 కోట్లకు పైగా ఆదా అయ్యే అవకాశం ఉంది.

గతంలో రూపొందించిన ప్రణాళిక ప్రకారం 237 ఆస్తులను సేకరించాల్సి ఉండేది. కొత్త ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదన అమలైతే భూసేకరణ భారం గణనీయంగా తగ్గనుంది.

ADVERTISEMENT

వివరాలు 

వన్‌వే కొనసాగింపు.. తుది ఆమోదం రావాల్సిందే

ప్రస్తుతం కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ విజయవంతంగా అమలవుతున్న వన్‌వే విధానాన్ని యథాతథంగా కొనసాగించనున్నారు.

ఇప్పటికే పనులు ప్రారంభించిన ప్రాంతాల్లో అవసరమైన చోట నిర్మాణాలను నిలిపివేసి, రహదారులను తిరిగి పునరుద్ధరించనున్నారు.

అయితే, కొత్తగా ప్రతిపాదించిన ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి తుది ఆమోదం లభించాల్సి ఉంది.

ADVERTISEMENT