Rekha Gupta: అనుభవం లేకపోయినా ముఖ్యమంత్రి.. షాయారీతో సమాధానమిచ్చిన దిల్లీ సీఎం రేఖా గుప్తా
ఈ వార్తాకథనం ఏంటి
అనుభవం లేకున్నా ఒక్కసారిగా ఉన్నత పదవి చేపట్టడం ఎలా ఉందని దిల్లీ సీఎం రేఖాగుప్తాకు ప్రశ్న ఎదురైంది.
ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన ఆమె,తనదైన శైలిలో స్పందించారు.
ఉర్దూకవి రహత్ ఇందోరి రచించిన షాయరీను ప్రస్తావిస్తూ -"నేను కొమ్మల నుంచి రాలిపోయే ఆకును కాను..ఎవరైనా ఆ తుపానుకు చెప్పండి, అదుపులో ఉండమని" అంటూ బదులిచ్చారు.
"ముఖ్యమంత్రిగా మారడం నా లక్ష్యం కాదు.నా మార్గంలో నా పని చేసుకుంటూ ముందుకు వెళ్లాను.ఈ పదవి లాటరీ కాదుగానీ,మన దేశంలో మహిళలపై ఉన్న గౌరవానికి నిదర్శనం.మహిళలకు మరింత గుర్తింపు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,పార్టీ నాయకులు నన్నుఈ పదవిలో నియమించారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.ఈ నిర్ణయం దేశంలోని మహిళలకు ప్రేరణనిస్తుంది," అని రేఖా గుప్తా అన్నారు.
వివరాలు
విమర్శలు చేయడం ఎంతవరకు న్యాయం?: రేఖా
అదనంగా, గత ప్రభుత్వాల పరిపాలనలోని లోపాలను సరిచేసేందుకు,అవినీతిని నిర్మూలించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రేఖా గుప్తా దిల్లీ సీఎంగా నియమితులయ్యారు.
తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమెకు ఈ అరుదైన అవకాశం లభించింది.సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ ఆమెపై విమర్శలు చేయగా,ఆమె సమర్థంగా సమాధానం ఇచ్చారు.
"భారతీయ జనతా పార్టీ ఎన్నికల హామీలను నెరవేర్చలేదంటూ"దిల్లీ మాజీ సీఎం ఆతిశీ చేసిన ఆరోపణలను రేఖా గుప్తా తీవ్రంగా ఖండించారు."కాంగ్రెసు 15 సంవత్సరాలు,ఆమ్ ఆద్మీ పార్టీ 13 సంవత్సరాలు దిల్లీని పాలించాయి.ఇన్నాళ్లు మీరేమి చేసారో చూడకుండా,మేము అధికారంలోకి వచ్చి ఒక్కరోజు కూడా గడవకముందే విమర్శలు చేయడం ఎంతవరకు న్యాయం?"అని ఆమె ప్రశ్నించారు.