LOADING...
Karnataka: ధారవాడలో స్కూల్ పిల్లల కిడ్నాప్ యత్నం.. కట్‌ చేస్తే సీన్‌ రివర్స్‌..!
ధారవాడలో స్కూల్ పిల్లల కిడ్నాప్ యత్నం.. కట్‌ చేస్తే సీన్‌ రివర్స్‌..!

Karnataka: ధారవాడలో స్కూల్ పిల్లల కిడ్నాప్ యత్నం.. కట్‌ చేస్తే సీన్‌ రివర్స్‌..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 13, 2026
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక రాష్ట్రంలోని ధారవాడలో ఒక ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ పిల్లలను కిడ్నాప్'కు యత్నించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల ఇద్దరు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తరువాత తరగతి గదిలోకి తిరిగి రాకపోవడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. కమలాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి విద్యార్థులు భోజన విరామం తర్వాత క్లాస్ కి తిరిగి రాకపోవడంతో స్కూల్ సిబ్బంది, యాజమాన్యం వారి కోసం వెతికారు. పిల్లలు తరగతి గదిలో లేరని, ఇంటికి కూడా వెళ్ళలేదని గుర్తించాక, తల్లిదండ్రులు స్థానిక సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. దీంతో వారు కిడ్నాప్‌నకు గురైనట్లు తెలిసింది.

వివరాలు 

పిల్లల కోసం ముమ్మర గాలింపు

లంచ్‌ బ్రేక్‌ సమయంలో ఒక వ్యక్తి స్కూల్ ప్రాంగణంలోకి వచ్చి పిల్లలతో మాట్లాడుతూ, ఇద్దరినీ బైక్‌లో ఎక్కించుకొని అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదు అయ్యింది. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే స్కూల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పిల్లల కోసం ముమ్మరంగా గాలింపు ప్రారంభించారు. అదే సమయంలో పిల్లలను తీసుకెళ్తుండగా ఉత్తర కన్నడ జిల్లాలోని దండేలీ ప్రాంతంలో దుండగుడు నడుపుతున్న బైక్‌కు ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నపుడు, అతడు పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. పిల్లలను కిడ్నాప్ చేసినట్లు ధృవీకరించిన పోలీసులు, పిల్లలను రక్షించి ధారవాడ పోలీసులకు సమాచారమిచ్చారు.

వివరాలు 

జాతర చూపిస్తానని ఆశ పెట్టి.. 

ధారవాడ పోలీసులు వారు అక్కడికి చేరుకుని పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడి పేరు కరీమ్ మేస్త్రీగా గుర్తించారు. అతడిని వెంటనే అరెస్ట్ చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కిడ్నాప్ వెనక పిల్లల అక్రమ రవాణా ముఠా ఉండొచ్చని భావిస్తున్నారు. పిల్లల్లో ఒకరికి నిందితుడు తెలుసని, జాతర చూపిస్తానని ఆశ పెట్టి అతనివెంట తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement