తిరుమల నడకమర్గంలో మొదలైన ఆంక్షలు; మధ్యాహ్నం 2దాటితే వారికి నో ఎంట్రీ
చిరుతపులి దాడిలో చిన్నారి లక్షిత మృతి చెందిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు ఆంక్షలు విధించింది. తిరుమల-అలిపిరి నడకదారిలో ఆ ఆంక్షలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. అలిపిరి నడకమార్గంలో 12ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం 2గంటల తర్వాత అనుమతించేదిలేదని టీటీడీ పేర్కొంది. 12ఏళ్ల పైన పిల్లలున్న భక్తులను రాత్రి 10గంటల వరకు నడకమార్గంలో అనుమతిస్తారు. ఈ విషయాన్ని భక్తులకు చెప్పేందుకు నడకమార్గంలో టీటీడీ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా, సాయంత్రం తర్వాత నడకమార్గంలో బైక్‌లకు అనుమతి లేదని టీటీడీ స్పష్టం చేసింది. నడకదారిలో వెళ్లే వారికి త్వరలోనే ఊతకర్ర అందించనున్నారు. అయితే కొత్త ఆంక్షలు అమలు నేపథ్యంలో తిరుమల-అలిపిరి నడకదారిలో భక్తుల సంఖ్య తగ్గింది.