
Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ విజయవంతం.. 20 మంది అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులపై చేపట్టిన ఆపరేషన్ కగార్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం మొత్తం ఎనిమిది మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు. మరో 20 మంది నక్సలైట్లు పోలీసుల చేతిలో అరెస్టయ్యారు.
వీరి వద్ద నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులు పలు హోదాల్లో పని చేసినవారని ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ తెలిపారు.
ఆయన ఎదుటే మావోయిస్టు పార్టీకి చెందిన వారు అధికారికంగా లొంగిపోయారు.
తెలంగాణ పోలీసుల తాజా కార్యక్రమమైన 'పోరు కన్నా ఊరు మిన్న... మన ఊరుకి తిరిగిరండి' అనే పిలుపుకు మంచి స్పందన వస్తోందని ఎస్పీ పేర్కొన్నారు.
Details
లొంగిపోయిన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ
మావోయిస్టులు ఈ పిలుపుతో చైతన్యం పొంది మున్ముందు సమాజంలో విలీనం కావాలని భావిస్తున్నారని వెల్లడించారు.
లొంగిపోయిన వారి పట్ల ప్రభుత్వం పూర్తిస్థాయి పునరావాసం కల్పించనుందని తెలిపారు. ఇప్పటికే వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు.
అంతేకాక వారిపై ఉండే బహుమతి మొత్తాన్ని 24 గంటల లోపే వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని ఎస్పీ శబరిష్ స్పష్టం చేశారు.
అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా ప్రజల జీవనవిజ్ఞానంలో కలిసిపోవాలని, శాంతిమార్గాన్ని అవలంబించాలని ఎస్పీ శబరిష్ కోరారు.