
Paka Venkata Satyanarayana: ఏపీ రాజ్యసభ ఎన్డీయే అభ్యర్థిగా పాక వెంకటసత్యనారాయణ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ ఖాళీ స్థానానికి అభ్యర్థి పేరు తేలింది. ఎన్డీయే తరఫున ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ(BJP) నేత పాక వెంకటసత్యనారాయణను బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.
ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది.
దీంతో కొత్త అభ్యర్థి పేరుపై అనేక ఊహాగానాలు, చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వివరణ వచ్చింది.
అభ్యర్థి ఎంపికపై బీజేపీ కేంద్ర నాయకత్వం మంగళవారం (ఏప్రిల్ 29) నామినేషన్ గడువు ముగిసే ముందు అధికారిక ప్రకటన చేసింది.
Details
1996లో నర్సాపురం లోకసభ స్థానం నుంచి పోటీ చేసిన సత్యానారాయణ
మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో పాక వెంకటసత్యనారాయణ పేరును తుది అభ్యర్థిగా ఖరారు చేసింది. గతంలో కూడా పాక వెంకటసత్యనారాయణ రాజకీయంగా చురుకుగా వ్యవహరించారు.
ఆయన 1996లో నర్సాపురం లోకసభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
ఇప్పుడు ఎన్డీయే తరఫున రాజ్యసభకు ఎంపికవుతున్న ఆయనపై పార్టీ అత్యున్నత నాయకత్వానికి పూర్తి విశ్వాసం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.