జమ్ము:పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు..ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బందికి తుపాకీ గాయాలు
జమ్ములోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఇద్దరు సిబ్బందికి తుపాకీ గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన సిబ్బందిని ప్రభుత్వ వైద్య కళాశాల(జిఎంసి)ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి "స్థిరంగా" ఉందని పిటిఐ నివేదిక తెలిపింది. ఇద్దరు సిబ్బందికి బుల్లెట్ గాయాలయ్యాయని, వెంటనే వైద్య సహాయం అందించామని బీఎస్ఎఫ్ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నిన్న పాక్ రేంజర్లు BSF దళాలపై అకారణంగా కాల్పులు జరిపారు.దీనికి అర్నియా సెక్టార్‌లో అప్రమత్తమైన BSF దళాలు తగిన విధంగా ప్రతీకారం తీర్చుకున్నాయి. ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బందికి బుల్లెట్ గాయాలు తగిలాయి. వారికి వెంటనే వైద్య సహాయం అందించారని PRO ఒక ప్రకటనలో తెలిపారు.