Prabhas: 'ది రాజా సాబ్' తర్వాత ప్రభాస్ దూకుడు.. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో అభిమానుల్లో ఉత్సాహం
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్‌లో బిజీ దశలో కొనసాగుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ది రాజా సాబ్' మిశ్రమ స్పందనను అందుకున్నప్పటికీ, అభిమానుల్లో మాత్రం ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. చాలా కాలం తర్వాత తెరపై కనిపించిన 'వింటేజ్ ప్రభాస్' లుక్, మాస్ హావభావాలు, ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టాక్ ఎలా ఉన్నా, ప్రభాస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని ఈ చిత్రం మరోసారి నిరూపించిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 'ది రాజా సాబ్'తో థియేటర్లలో సందడి చేస్తూనే ప్రభాస్ భవిష్యత్ ప్రాజెక్టుల లైనప్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
Details
సెట్స్ పై వెళ్లిన స్పిరిట్ 2
మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'స్పిరిట్' కూడా తాజాగా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ రెండు భారీ చిత్రాలను ఒకేసారి హ్యాండిల్ చేస్తూనే, ప్రభాస్ తన కెరీర్‌లో కీలకమైన సీక్వెల్ 'కల్కి 2'కు కూడా డేట్స్ కేటాయించడం విశేషంగా మారింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 AD' బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, ఈ సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. తాజా సమాచారం ప్రకారం 'కల్కి 2' షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుండగా, ప్రభాస్ మాత్రం మార్చి తర్వాత సెట్స్‌లోకి అడుగుపెట్టే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Details
కొన్ని కీలక సన్నివేశాలు ముందుగానే చిత్రీకరణ
ఇందుకోసం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మహాభారత ఇతివృత్తాన్ని సైన్స్ ఫిక్షన్‌తో మేళవించి రూపొందిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ భైరవగా, కర్ణగా ద్విపాత్రాభినయం చేయనున్నాడు. పార్ట్ వన్ షూటింగ్ సమయంలోనే దర్శకుడు నాగ్ అశ్విన్ సెకండ్ పార్ట్‌కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ముందుగానే చిత్రీకరించడం గమనార్హం. తఈసారి విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా మారనున్న నేపథ్యంలో ప్రభాస్‌కు సంబంధించిన సీన్స్‌ను ముందుగానే పూర్తి చేసి సీజీ పనులను వేగవంతం చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.
Details
కల్కి 2'పై భారీ అంచనాలు
సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ముందుకు సాగుతున్న ప్రభాస్ కమిట్‌మెంట్ మరోసారి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. 2024లో విడుదలైన 'కల్కి 2898 AD' వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ప్రభాస్ కెరీర్‌లో రెండో వెయ్యి కోట్ల చిత్రంగా నిలవడం విశేషం. భారీ విజువల్స్, కొత్త తరహా కథనం, మైథాలజీ-ఫ్యూచరిజం కలయికతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే విజయం 'కల్కి 2'పై అంచనాలను రెట్టింపు చేయగా, తాజా షూటింగ్ అప్‌డేట్స్‌తో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరుగుతోంది.