LOADING...
Lenin: అఖిల్ 'లెనిన్' షూటింగ్ అప్‌డేట్.. కీలక షెడ్యూల్‌కు సిద్ధమైన యూనిట్
అఖిల్ 'లెనిన్' షూటింగ్ అప్‌డేట్.. కీలక షెడ్యూల్‌కు సిద్ధమైన యూనిట్

Lenin: అఖిల్ 'లెనిన్' షూటింగ్ అప్‌డేట్.. కీలక షెడ్యూల్‌కు సిద్ధమైన యూనిట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2026
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

అక్కినేని యంగ్ హీరో అక్కినేని అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రం 'లెనిన్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ షూటింగ్‌కు స్వల్ప విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ వారం నుంచే కీలకమైన క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ షెడ్యూల్‌లో అఖిల్‌తో పాటు ప్రధాన తారాగణం మొత్తం పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

Details

హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ముఖ్యంగా చిత్తూరు ప్రాంత నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇందులో 'మిస్టర్ బచ్చన్' ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, అఖిల్-భాగ్యశ్రీ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. ప్రస్తుతం చిత్ర బృందం ఒకవైపు షూటింగ్‌ను ముగింపు దశకు తీసుకువెళ్తూనే, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా కొనసాగిస్తోంది. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్, ఈ సినిమాకు వస్తున్న అవుట్‌పుట్‌పై చాలా ధీమాగా ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి రాయలసీమ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో అఖిల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాల్సిందే.

Advertisement