Page Loader
Pashupati Paras: బీజేపీ-చిరాగ్ పాశ్వాన్ ఒప్పందం.. పశుపతి పరాస్ మంత్రి పదవికి రాజీనామా  
బీజేపీ-చిరాగ్ పాశ్వాన్ ఒప్పందం.. పశుపతి పరాస్ మంత్రి పదవికి రాజీనామా

Pashupati Paras: బీజేపీ-చిరాగ్ పాశ్వాన్ ఒప్పందం.. పశుపతి పరాస్ మంత్రి పదవికి రాజీనామా  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 19, 2024
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో ఎన్డీయే సీట్ల పంపకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పశుపతి పరాస్ కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం విలేకరుల సమావేశంలో పశుపతి పరాస్‌ వెల్లడించారు. పశుపతి పరాస్ కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. పశుపతి కుమార్ పరాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నేను నా రాజీనామాను పంపాను. ఎంతో నిజాయితీగా, విధేయతతో ఎన్డీయేకు సేవలందించాను. ఈ రోజు కూడా నేను ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు,పార్టీకి అన్యాయం జరిగింది. అందుకే ఈ రోజు నేను కేంద్ర మంత్రిమండలికి రాజీనామా చేస్తున్నాను. పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత తదుపరి చర్య గురించి తెలియజేస్తానని అయన తెలిపారు.

Details 

ఇండియా అలయన్స్‌తో టచ్‌లో ఉన్న  పశుపతి 

సీట్ల పంపకాల ప్రకటనకు ముందు బీజేపీ పెద్ద నేతలెవరూ తనతో మాట్లాడకపోవడం, చిరాగ్ పాశ్వాన్ అమిత్ షా, జేపీ నడ్డాలతో మాట్లాడడంపై పశుపతి పరాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర కేబినెట్‌కు రాజీనామా చేసిన తర్వాత పశుపతి ఇండియా అలయన్స్‌తో టచ్‌లో ఉన్నారు. ఈరోజు సాయంత్రం పాట్నా చేరుకోనున్న పశుపతి, అక్కడ ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌తో భేటీ కానున్నారు. పశుపతి పరాస్ ఇండియా అలయన్స్ నుంచి 6 సీట్లు డిమాండ్ చేశారు. మూడు సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ సిద్ధంగా ఉంది. నవాడ సీటుకు సంబంధించి సమస్య ఉంది. నవాడను వీడేందుకు ఆర్జేడీ సిద్ధంగా లేదు. పశుపతి పరాస్‌ను హాజీపూర్‌ నుంచి, ప్రిన్స్‌ రాజ్‌ను సమస్తిపూర్‌ నుంచి పోటీ చేసేలా అంగీకారం కుదిరింది.

Details 

ఉపేంద్ర కుష్వాహా అసంతృప్తి 

మరోవైపు ఉపేంద్ర కుష్వాహా పార్టీ రాష్ట్రీయ లోక్ మోర్చా ఒక్క సీటు మాత్రమే దక్కించుకోవడంపై అసంతృప్తితో ఉంది. కుష్వాహా తన పార్టీకి రెండు సీట్లు కావాలని కోరగా.. కరకట్,సుపాల్ లేదా సీతామర్హి నుంచి ఒక సీటు కావాలని కోరారు. తన అసంతృప్తి కారణంగా,సీట్ల పంపకాన్ని ప్రకటించడానికి బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి కుష్వాహా తన పార్టీ ప్రతినిధిని పంపలేదు. బీజేపీ జనరల్ సెక్రటరీ,పార్టీ బీహార్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వినోద్ తావ్డే ప్రకారం,బీహార్‌లోని 17 లోక్‌సభ స్థానాల్లో,జేడీయూ 16 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఉపేంద్ర కుష్వాహా పార్టీ రాష్ట్రీయ లోక్ మోర్చా ఒక స్థానంలో,జితన్ రామ్ మాంఝీ పార్టీ 'హమ్' ఒక స్థానంలో పోటీ చేయనున్నాయి.