LOADING...
Pawan kalyan: పవన్‌ కళ్యాణ్ భుజానికి రేపు శస్త్రచికిత్స
పవన్‌ కళ్యాణ్ భుజానికి రేపు శస్త్రచికిత్స

Pawan kalyan: పవన్‌ కళ్యాణ్ భుజానికి రేపు శస్త్రచికిత్స

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2026
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం ముంబయికి వెళ్లనున్నారు. అక్కడి కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో శనివారం ఆయన భుజానికి శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ఇటీవల జూన్ నెలాఖరులో అదే ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న పవన్ కళ్యాణ్‌కు రెండు భుజాలకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో తొలి దశలో శనివారం ఒక భుజానికి ఆపరేషన్ చేయనున్నారు. అనంతరం కొద్ది రోజుల విరామం ఇచ్చి రెండో భుజానికి కూడా శస్త్రచికిత్స చేపట్టనున్నట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంబైకి పవన్ కళ్యాణ్.. రేపు భుజాలకు శస్త్రచికిత్స

Advertisement