Maharashtra: సోలార్ కంపెనీలో పేలుడు.. 9మంది దుర్మరణం
మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఒక కంపెనీలో ఆదివారం జరిగిన పేలుడులో ఆరుగురు మరణించారు. బజార్‌గావ్ ప్రాంతంలో ఉన్న సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్‌లో ఈరోజు ఉదయం దాదాపు 9.30 గంటలకు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మరికొందరికి గాయాలు కాగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసు బృందం ఘటనాస్థలికి చేరుకుంది. బొగ్గు బ్లాస్టింగ్ కోసం పేలుడు పదార్థాలను ప్యాకింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. బొగ్గు బ్లాస్టింగ్ కోసం పేలుడు పదార్థాలను ప్యాకింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. దేశ రక్షణ విభాగానికి పేలుడు పదార్థాలు, ఇతర రక్షణ పరికరాలను సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ సరఫరా చేస్తుంది.