తదుపరి వార్తా కథనం

RK Roja: పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలు క్షమించరు.. నేను వైసీపీలోనే ఉంటా : రోజా
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 01, 2024
09:31 am
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ మంత్రి రోజా వైకాపాను వీడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని అసత్యమని ఖండించారు.
తాను పార్టీ మారే ప్రసక్తే లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. శనివారం ఉదయం సినీనటి రవళితో కలిసి తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు.
పార్టీ మారే నాయకులు జగన్ గారికి, వైసీపీ ఎటువంటి నష్టం కలిగించలేరని చెప్పారు. పార్టీకి ద్రోహం చేసే వారిని ప్రజలు, పార్టీ క్షమించదని రోజా వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ కరవైందని ఆమె ఆరోపించారు.
మహిళలపై దాడులు, ర్యాగింగ్ ఘటనలు పెరుగుతున్నాయని, కళాశాల బాత్రూమ్‌లలో కెమెరాలు పెట్టి అసభ్యకృత్యాలు జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
మీరు పూర్తి చేశారు