Loading...
Pulivendula: పులివెందులలో పెట్రోల్‌ బాంబుల దాడి.. పరిషత్‌ పోలింగ్‌ వేళ పలుచోట్ల ఉద్రిక్తత
పులివెందులలో పెట్రోల్‌ బాంబుల దాడి.. పరిషత్‌ పోలింగ్‌ వేళ పలుచోట్ల ఉద్రిక్తత

Pulivendula: పులివెందులలో పెట్రోల్‌ బాంబుల దాడి.. పరిషత్‌ పోలింగ్‌ వేళ పలుచోట్ల ఉద్రిక్తత

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2026
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్న వేళ పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌ కడప, తిరుపతి జిల్లాల్లో పెట్రోల్‌ బాంబులతో దాడులు జరగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పులివెందుల మండలం ఎర్రిపల్లె పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తొలుత వైకాపా కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పెట్రోల్‌ బాంబులు వేయడంతో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

వివరాలు 

పోలింగ్‌ కేంద్రానికి సమీపంలో పెట్రోల్‌ బాంబులతో దాడి

తిరుపతి జిల్లా పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది.

వైకాపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సమయంలో పోలింగ్‌ కేంద్రానికి సమీపంలో పెట్రోల్‌ బాంబులతో దాడి చేశారు.

దీంతో అధికారులు అప్రమత్తమై పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

కడప జిల్లా నందలూరులోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుపతి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన రౌడీలను స్థానికులు అడ్డుకున్నారు.

దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

వివరాలు 

ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట

పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లిలోనూ ఘర్షణ జరిగింది.

వైకాపా మాజీ ఎమ్మెల్యే జోగారావు స్వగ్రామమైన ఈ ప్రాంతంలో ఆ పార్టీ నేతలు దౌర్జన్యానికి దిగడంతో తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు.

పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లేందుకు వైకాపా నేతలు ప్రయత్నించగా తెదేపా శ్రేణులు వారిని నిలువరించాయి.

దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. విజయనగరం జిల్లా గరివిడి పోలింగ్‌ కేంద్రం వద్ద వైకాపా,జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇరుపార్టీల నేతలు పరస్పరం నెట్టుకోవడంతో అక్కడ తోపులాట జరిగింది.

ఈ క్రమంలో జనసేన నాయకురాలిపై వైకాపా నేత దాడికి పాల్పడ్డారు.పోలింగ్‌ బూత్‌ వద్ద వైకాపా జడ్పీటీసీ అభ్యర్థి బొత్స పూజిత ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

ADVERTISEMENT