Page Loader
Katra Ropeway Project: జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి రోప్‌వే నిర్మాణానికి వ్యతిరేకంగా కాట్రాలో72 గంటల పాటు బంద్ 
జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి రోప్‌వే నిర్మాణానికి వ్యతిరేకంగా కాట్రాలో72 గంటల పాటు బంద్

Katra Ropeway Project: జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి రోప్‌వే నిర్మాణానికి వ్యతిరేకంగా కాట్రాలో72 గంటల పాటు బంద్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 26, 2024
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయ బేస్‌క్యాంప్‌ అయిన కాట్రా పట్టణంలో ప్రతిపాదిత రోప్‌వే నిర్మాణ ప్రాజెక్టును నిలిపివేయాలని ఆందోళనకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బుధవారం నుండి 72 గంటల పాటు పట్టణం మొత్తం బంద్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, నిరసన చేస్తున్న వారిని అడ్డుకోవడానికి పోలీసులు రంగంలో దిగడంతో, పలు చోట్ల ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. అయితే, వైష్ణోదేవి ఆలయానికి యాత్రికులు చేరుకోవడానికి 13 కిలోమీటర్ల పొడవైన ట్రెక్కింగ్‌ను చేస్తారు. అయితే, పిల్లలు, వృద్ధులు ఈ ట్రెక్కింగ్‌ను చేయడం చాలా కష్టంగా మారడంతో.. దీన్ని సులభంగా చేయడానికి ₹250 కోట్లతో రోప్‌వే ప్రాజెక్టును నిర్మించాలని పుణ్యక్షేత్ర బోర్డు నిర్ణయం తీసుకుంది.

వివరాలు 

వైష్ణోదేవి సంఘర్ష్‌ సమితి నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 

ఈ బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా కాట్రా పట్టణంలో బంద్‌ పిలుపునిచ్చిన శ్రీ మాతా వైష్ణోదేవి సంఘర్ష్‌ సమితి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారు ఈ రోప్‌వే ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీని వల్ల వేలాది మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ, ప్రభుత్వంతో చర్చలు జరపడం కంటే, పోలీసుల్ని ప్రయోగించి తమను నిర్బంధించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, బంద్‌ పిలుపు కారణంగా పట్టణంలోని వ్యాపార సంస్థలు మూతపడటంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరసనకు ఇది సరైన సమయం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.