Page Loader
Madhya Pradesh: గుణలో కూలిన ట్రైనీ విమానం.. మహిళా పైలెట్‌కు తీవ్ర గాయాలు
Madhya Pradesh: గుణలో కూలిన ట్రైనీ విమానం.. మహిళా పైలెట్‌కు తీవ్ర గాయాలు

Madhya Pradesh: గుణలో కూలిన ట్రైనీ విమానం.. మహిళా పైలెట్‌కు తీవ్ర గాయాలు

వ్రాసిన వారు Stalin
Mar 06, 2024
06:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ట్రైనీ విమానం కూలిన ఘటన బుధవారం వెలుగు చూసింది. విమానం నీముచ్ నుంచి సాగర్‌కు బయలుదేరగా.. గుణ సమీపంలో విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. ఈ క్రమంలో గుణ హెలిప్యాడ్ రన్‌వేపై విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కూలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. విమానం చెరువు సమీపంలోని పొదల్లో పడిపోయింది. ఏరోడ్రోమ్‌లో ఉన్న రెస్క్యూ టీమ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పైలట్ నాన్సీ మిశ్రాను విమానం నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మహిళా పైలట్ నాన్సీ మిశ్రా తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆమెను వెంటనే జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. మూడేళ్ల క్రితం, మార్చి 27, 2021న భోపాల్‌లోని గాంధీ నగర్ ప్రాంతంలో ట్రైనీ విమానం కూలిపోయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విమానం కూలిన దృశ్యాలు