
PM Modi : మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన
ఈ వార్తాకథనం ఏంటి
PM Modi Telangana Tour : లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వేగవంతం చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రధాని మోదీ తెలంగాణకు సైతం రానున్నారు. మార్చి 4, 5 తేదీల్లో మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో జరగనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొనున్నారు.
4న అదిలాబాద్ జిల్లాలో, 5వ తేదీన సంగారెడ్డి జిల్లాలో మోదీ పర్యటనకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. ఈ ప్రాంతాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో మోదీ ప్రసంగించనున్నారు.
మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లతో ఇప్పటికే తెలంగాణ బీజేపీ నిమగ్నమైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆదిలాబాద్, సంగారెడ్డిలో మోదీ పర్యటన
ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన
— BIG TV Breaking News (@bigtvtelugu) February 28, 2024
నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేసే అవకాశం
అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ#PMNarendraModi #BJP4India #bjptelangana#NewsUpdate #bigtvlive@BJP4Telangana pic.twitter.com/PAZKYWOKQv