Loading...
Independence Day speech: ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రసంగం.. ఎక్కడ, ఎప్పుడు లైవ్‌లో చూడాలంటే?
ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రసంగం.. ఎక్కడ, ఎప్పుడు లైవ్‌లో చూడాలంటే?

Independence Day speech: ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రసంగం.. ఎక్కడ, ఎప్పుడు లైవ్‌లో చూడాలంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2026
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఆగస్టు 15న దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రతేడాది స్వాతంత్య్రం దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుంచి ప్రధాని జెండా ఎగురవేసి, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, విధానాలు, దేశ ప్రగతికి సంబంధించిన అంశాలను ప్రజలకు వివరిస్తారు.

వివరాలు

ఉదయం 7.30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం

2026 ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉదయం 7.30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

దూరదర్శన్‌ (DD), ఇతర వార్తా ఛానళ్లు వేడుకలను ప్రసారం చేయనున్నాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) తన సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా కార్యక్రమాన్ని లైవ్‌ స్ట్రీమ్ చేయనుంది.

ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఆన్‌లైన్‌లో PMO అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌, DD News, PMIndia.gov.in, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌ (NIC)కు చెందిన ఇండిపెండెన్స్ డే వెబ్‌సైట్‌ ద్వారా వీక్షించవచ్చు.

వివరాలు

1947లో స్వాతంత్య్రం

భారత్‌ బ్రిటిష్‌ పాలన నుంచి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందింది.

ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా అధికార బదిలీ జరిగి, భారత రాజ్యాంగ సభకు సార్వభౌమాధికారం అప్పగించబడింది.

అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 15న ప్రధానమంత్రి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

ఈ సంప్రదాయాన్ని తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1947లో ప్రారంభించారు.

ADVERTISEMENT

వివరాలు

80వ స్వాతంత్ర్య దినోత్సవం ఎందుకు?

భారత్‌ 1947 ఆగస్టు 15న స్వతంత్ర దేశంగా అవతరించింది. 2026 ఆగస్టు 15 నాటికి స్వాతంత్ర్యం సాధించి 79 ఏళ్లు పూర్తవుతాయి.

అయితే స్వాతంత్ర్యం పొందిన రోజునే తొలి స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించడంతో.. 2026లో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశం జరుపుకోనుంది.

విభజన విషాదాన్ని గుర్తు చేసుకుంటూ..

స్వాతంత్య్ర వేడుకలకు ముందు రోజు ఆగస్టు 14న విభజన విషాద స్మారక దినోత్సవం (Partition Horrors Remembrance Day) నిర్వహిస్తారు.

1947లో దేశ విభజన సమయంలో జరిగిన హింస, ప్రాణనష్టం, ప్రజలు ఎదుర్కొన్న తీవ్ర కష్టాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటారు.

స్వాతంత్య్రానికి ముందు చోటుచేసుకున్న ఆ విషాద ఘటనలను భవిష్యత్ తరాలకు గుర్తుచేయడమే ఈ దినోత్సవ ఉద్దేశం.

ADVERTISEMENT

వివరాలు

ప్రసంగం కోసం ప్రజల నుంచి సూచనలు

ప్రధాని మోదీ గత కొన్నేళ్లుగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం కోసం ప్రజల నుంచి సూచనలు, ఆలోచనలు స్వీకరిస్తున్నారు.

ఈ ఏడాది కూడా 'MyGov పోర్టల్‌' ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు పంపేందుకు అవకాశం కల్పించారు. ఇందుకు ఆగస్టు 12 రాత్రి 11.45 గంటల వరకు గడువు ఇచ్చారు.

ADVERTISEMENT