Loading...
PM Modi: డిసెంబర్‌లో కెనడాకు ప్రధాని మోదీ.. వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు?
డిసెంబర్‌లో కెనడాకు ప్రధాని మోదీ.. వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు?

PM Modi: డిసెంబర్‌లో కెనడాకు ప్రధాని మోదీ.. వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2026
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-కెనడా దౌత్య సంబంధాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇరుదేశాల మధ్య గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో,సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 11, 12 తేదీల్లో కెనడాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ధ్రువీకరించారు. ఆల్బెర్టాలో జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగ్‌కు ముందు కాల్గరీలోని ఓ స్థానిక రెస్టారెంట్‌లో సందర్శకులతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రధాని మోదీతో నేరుగా చర్చలు జరుపుతానని కార్నీ తెలిపారు. ఈ పర్యటన ప్రధానంగా టొరంటో,ఒట్టావా నగరాల్లో కొనసాగుతుందని వెల్లడించారు. పరిస్థితులను బట్టి ఇతర నగరాల్లోనూ పర్యటన కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వివరాలు 

వాణిజ్య ఒప్పందం దిశగా వేగంగా అడుగులు

భారత్‌, కెనడా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇరుదేశాలు దౌత్యపరమైన చర్చలను వేగవంతం చేశాయి.

2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏటా 70 బిలియన్‌ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఈ ఏడాది చివరి నాటికి వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఇందులో భాగంగా కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మనీందర్‌ సిద్ధూ ప్రస్తుతం ఆరు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో ఉన్నారు.

ఈ పర్యటనలో వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరగనున్నాయి.

వివరాలు 

గత ఉద్రిక్తతలకు ముగింపు.. సత్సంబంధాల దిశగా అడుగులు

గత కొన్నేళ్లుగా భారత్‌-కెనడా సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

2023లో అప్పటి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో.. సిక్కు కార్యకర్త హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేశారు.

ఈ పరిణామం ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.

ఆ తర్వాతి ఏడాది ఇరుదేశాల దౌత్యవేత్తలపై నేరాలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో పరిస్థితులు మరింత దిగజారాయి.

దీనికి ప్రతిగా భారత్‌,కెనడా చెరో ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.

అయితే, నిజ్జర్‌ హత్య కేసులో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందన్న ఆరోపణలను భారత్‌ ఖండించింది.

తమపై చేసిన ఆరోపణలకు కెనడా తగిన ఆధారాలు చూపలేదని స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

కొత్త ప్రధాని రాకతో మారిన సమీకరణాలు

మార్క్‌ కార్నీ గత ఏడాది కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌ పట్ల ఆ దేశ వైఖరిలో మార్పు కనిపించింది.

గతేడాది నవంబర్‌లో భారత్‌లో పర్యటించిన కార్నీ.. భారత్‌ను నమ్మకమైన వాణిజ్య భాగస్వామిగా అభివర్ణించారు.

దీంతో ఇరుదేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు అవకాశాలు పెరిగాయి.

ADVERTISEMENT

వివరాలు 

కొత్త ప్రధాని రాకతో మారిన సమీకరణాలు

ఇదిలా ఉండగా,కెనడాలో భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరపూరిత కార్యకలాపాలపై కెనడా రాయల్‌ మౌంటెడ్‌ పోలీస్‌ కీలక ప్రకటన చేసింది.

ప్రస్తుతం తమ వద్ద ఉన్న దర్యాప్తు వివరాల ప్రకారం.. కెనడాలో జరుగుతున్న విదేశీ అణచివేత చర్యలకు విదేశీ శక్తులతో నేరుగా సంబంధాలున్నట్లు నిరూపించే క్రిమినల్‌ ఆధారాలు లభించలేదని ఆ సంస్థ కమిషనర్‌ మైక్‌ డుహేమ్‌ వెల్లడించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌-కెనడా మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ మెరుగుపడతాయనే అంచనాలు నెలకొన్నాయి.

ADVERTISEMENT