LOADING...
Pocharam project: ప్రమాదం అంచున కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు 
ప్రమాదం అంచున కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు

Pocharam project: ప్రమాదం అంచున కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2025
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

కామారెడ్డి జిల్లా, నాగిరెడ్డిపేట మండలం పరిధిలోని పోచారం ప్రాజెక్టు ప్రమాదకర స్థితికి చేరుతోంది. సమీపంలో భారీ వరద ఉధృతి కారణంగా అలుగుప్రవాహం 10 అడుగుల ఎత్తుతో కిందికి దూకుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా వరద ప్రవాహాన్ని పూర్తిగా నియంత్రించలేక మట్టి కట్టను ఢీకొని, నదీప్రవాహం విపరీతంగా పొంగిపొర్లుతోంది. ఈ కారణంగా పెద్ద బుంగ ఏర్పడే అవకాశాలు ఏర్పడ్డాయి. అదే జరిగితే పోచారం ప్రాజెక్టు తెగిపోయే అవకాశాలు ఉన్నాయి.

వివరాలు 

రైల్వే సేవలపై ప్రభావం 

ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో కురుస్తున్న నిరంతర భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్-హైదరాబాద్ రూట్‌లో కామారెడ్డి జిల్లా బిక్కనూరు ప్రాంతంలో రైల్వే ట్రాక్ దెబ్బతిన్న కారణంగా, పలు రైళ్ల రాకపోకలను సౌత్ సెంట్రల్ రైల్వే తాత్కాలికంగా నిలిపివేసింది. అధికారిక ప్రకటనలో, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రద్దు చేయబడిందని తెలిపారు. అదేవిధంగా, నిజామాబాద్ ద్వారామహారాష్ట్రకు వెళ్లే రైళ్లు ఇప్పుడు కాచిగూడ, కాజీపేట, పెద్దపల్లి, నిజామాబాద్ మార్గంలో దారి మళ్లిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రమాదంలో పోచారం ప్రాజెక్టు