Pregnant Journalist : రాహుల్ గాంధీపై గర్భిణీ జర్నలిస్టు సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్ కౌంటర్
ఈ వార్తాకథనం ఏంటి
సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిరసన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనను బలంగా లాగి నెట్టేశారని మూడు నెలల గర్భిణి అయిన జర్నలిస్టు రిచా పరాశర్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. బీజేపీ రాజకీయ ప్రచారంలో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. వార్తా వెబ్‌సైట్ వన్‌ఇండియాలో పనిచేస్తున్న రిచా పరాశర్ ప్రస్తుతం ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వివరాలు
మైక్ ముందుకు పెట్టడంతోనే తోపులాట..
ఆసుపత్రిలో తనను పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతల సమక్షంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
రాహుల్ గాంధీ బయటకు వస్తున్న సమయంలో ఆయన నుంచి స్పందన తీసుకునేందుకు మైక్ ముందుకు పెట్టానని, దాన్ని పక్కకు జరపాలని ఆయన సైగ చేయడంతో వెనక్కి తీసుకున్నానని చెప్పారు.
అయితే ఇతర జర్నలిస్టులు మైకులు ముందుకు పెట్టడంతో, తాను కూడా మైక్‌ను ముందుకు పెట్టానని రిచా పరాశర్ తెలిపారు
ఆ సమయంలో రాహుల్ తన చేయి పట్టుకుని బలంగా లాగారని, ఆయన భద్రతా సిబ్బంది పక్కకు నెట్టడంతో మెట్లపై పడిపోయానని ఆరోపించారు.
తన కెమెరామన్ కూడా తనపై పడటంతో మోకాళ్లు, పొట్టకు దెబ్బ తగిలిందని పేర్కొన్నారు. తన ఫోన్ పగిలిపోయిందని, మైక్ రిసీవర్ ఊడిపోయిందని తెలిపారు.
వివరాలు
ఆరోపణలను తోసిపుచ్చిన కాంగ్రెస్ నేత అల్కా లాంబా
అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో రాహుల్ గాంధీ తనను నెట్టినట్లు స్పష్టంగా కనిపించడం లేదని కాంగ్రెస్ నేతలు, మద్దతుదారులు పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత అల్కా లాంబా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.
ఘటన జరిగిన సమయం, ఆసుపత్రికి వెళ్లిన సమయంపై సందేహాలు ఉన్నాయని, గర్భిణికి ఎక్స్‌రే ఎలా తీశారని ప్రశ్నించారు.
ఈ వ్యవహారాన్ని బీజేపీ రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకుంటోందని విమర్శించారు.
మరోవైపు, గర్భిణి జర్నలిస్టుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ సాయం చేయలేదని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఆరోపించారు.
మహిళల పట్ల కాంగ్రెస్ వైఖరి ఇదేనంటూ విమర్శలు చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాహుల్ గాంధీపై జర్నలిస్టు ఆరోపణలు
"Rahul Gandhi Pushed me down"
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) October 12, 2026
Rahul Gandhi now pushes a female journalist!
Rahul Gandhi's behavior are dangerous for Indian Democracy!
He pushes journalist, beats his workers with elbow punch, pushes his own Chief Minister.
Rahul Gandhi is behaving like a goon! pic.twitter.com/9GtJ36LDHO