PM Modi: సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
PM Modi visit Hyderabad: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రెండో రోజు కూడా కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా మంగళవారం సికింద్రాబాద్‌లోని మహంకాళి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న మోదీకి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ అధికారులు, అర్చకులు మోదీకి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ప్రధాని మోదీ రాకతో ఆలయ పరిసర ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రధాని మోదీ, సంగారెడ్డికి వెళ్లారు. సంగారెడ్డిలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.