LOADING...
PM Modi: ప్రధాని మోదీకి విశాఖలో స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్ 
ప్రధాని మోదీకి విశాఖలో స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్

PM Modi: ప్రధాని మోదీకి విశాఖలో స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2025
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీకి విశాఖపట్నంలో ఘనంగా స్వాగతం లభించింది. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. విశాఖలో రూ.2 లక్షల కోట్ల మేర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్‌ల శంకుస్థాపనలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి భారీ రోడ్ షో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ప్రధాని పర్యటనను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సర్వత్రా ఏర్పాట్లు చేపట్టింది. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తూ, పోలీసులు అన్ని అవసరమైన ఏర్పాట్లను చేసినట్టు ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ