Ravi Kiran: జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌కు టీటీడీ జేఈఓ బాధ్యతలు?
తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా జైళ్లశాఖలోని కోసాంధ్ర రేంజ్ డీఐజీ ఎంఆర్ రవికిమార్ నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంల ఆయన నియామక పత్రం కూడా సిద్ధమైనట్లు సమాచారం. టీటీడీ పరిధిలోని తిరుపతిలో ప్రస్తుతం జేఈఓలుగా వీరబ్రహ్మం, గౌతమ్ ఉన్నారు. వీరబ్రహ్మం స్థానంలో రవికిమార్ ను నియమించే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఈ పోస్టులో ఐఏఎస్‌లు, ఐఆర్ఎస్‌లు, ఢిపెన్స్ ఎస్టేట్ వంటి అధికారులే ఉన్నారు రవికిరణ్ నియామకంపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.