Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో కొండను ఢీకొని కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. పైలట్, సహ పైలట్ మృతి.. ఇదిగో వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్గఢ్'లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. జష్‌పూర్-నారాయణ్‌పూర్ అటవీ ప్రాంతంలో ఒక ప్రైవేట్ విమానం కొండను ఢీకొని కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్‌తో పాటు సహ పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే విమానంలో ప్రయాణించిన ఇతరుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విమానంలో పైలట్లతో సహా ఉన్న ప్రయాణికుల వివరాల గురించి ఆరా తీస్తున్నారు.
వివరాలు
దట్టమైన అటవీ ప్రాంతం..
ప్రాథమిక సమాచారం ప్రకారం, జష్‌పూర్-నారాయణ్‌పూర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ముందుగా ఒక చెట్టును ఢీకొన్న విమానం, అనంతరం కొండపై పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం సంభవించిన సమయంలో విమానం సుమారు 30 అడుగుల తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నట్లు చెబుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సహాయక చర్యలు చేపట్టడంలో అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదానికి అసలు కారణం ఏమిటి, విమానంలో ఎవరెవరు ఉన్నారు అనే వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కొండను ఢీకొన్న ప్రైవేట్ విమానం
🚨BREAKING | Aircraft crashed in the Ratanpahli forest area of Chhattisgarh's Jashpur district after hitting a tree while flying 30 feet above the ground
— The Tatva (@thetatvaindia) April 20, 2026
No reports of causalities yet pic.twitter.com/HnO5hurB47